|
| అదే ఉద్రిక్తత.... అవే అల్లర్లు |
| శ్రీనగర్ (ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 15:59 IST ) | |
అవే దృశ్యాలు.... అదే ఉద్రిక్తత.... అంతా నిర్మానుష్యం.... కొన్ని చోట్ల పోలీసులను తరుముతూ అందోళనకారులు... ఆందోళన కారులపై తరుముకుంటూ పోలీసులు... జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో ఈ దృశ్యాలు బంద్ సందర్భంగా మూడో రోజైన మంగళవారం కూడా దర్శనమిచ్చాయి. కాకపోతే గాయపడ్డ దాఖలాలు సాయంత్రం వరకూ లేవు. జమ్మూలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.
జమ్మూలో ఆందోళనకారులు నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య దాదాపు యుద్ధవాతావరణం నెలకొంది. అమరనాథ్ స్థలం కోసం ఆందోళన చెపట్టిన శ్రీ అమరనాథ్ యాత్ర సంఘర్షణా సమితి కార్యకర్తలు పోలీసులు, ఔట్ పోస్టులు, పోలీసు వాహనాలపై రాళ్ళు రువ్వారు.
వారిని చెదరగొట్టాడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సోమవారం నాటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉన్నత స్థాయి అధికారులను అక్కడకు పంపింది. పాఠశాలలు, కళాశాలలు, షాపులు మూసివేశారు. రోడ్లపై కొన్ని వాహనాలు తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు. ఇదిలా ఉండగా ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|