|
| బెంగళూరులో వరుస పేలుళ్ళు: ఒకరి మృతి |
బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలుక్కుపడింది. పేలుళ్ళు... పెద్దపెద్ద శబ్ధాలు చోటు చేసుకున్నాయి. దాదాపుగా నగరంలోని నడిబొడ్డుతో సహా శివార్లలో కూడా ఇవన్నీ చోటు చేసుకున్నాయి. శివాజీనగర్, మడివాడా, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో పేలుళ్ళు సంభవించాయి.
బెంగళూరు నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన వరుస పేలుళ్లలో ఒకరి మృతి చెందారు. 15మంది వరకు గాయపడ్డారు. ఈ పేలుళ్ళు ఆరు ప్రాంతాల్లో జరిగినట్లు సమాచారం ఉంది. అయితే మూడు చోట్ల మాత్రమే జరిగినట్లు అధికారులు చెపుతున్నారు. మొత్తంపై బెంగళూరు నగరం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
12 నిమిషాలలో వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్ళు పలువురు గాయపడ్డారు. వెంటనే టెలిఫోన్ వ్యవస్థను స్తంభింప చేశారు. మొదటగా మడివాలాలోని చెక్ పోస్టు వద్ద పెద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. మిగిలిన సంఘటనలు అశోక్ నగర్, నాయణహళ్ళి, అనిపల్యా ప్రాంతాలలో పేలుళ్ళు జరిగాయి.
అయితే అన్నీ కూడా తక్కువ ప్రాధాన్యత కలిగినవి కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే పేలుళ్ళు జరిగిన ప్రాంతాలలో ప్రముఖ వ్యాపార సంస్థలు ఉండడం విశేషం. అయితే ఇంకా ఎన్ని చోట్ల పేలుళ్ళు జరిగాయి. అనే విషయాన్ని అధికారులు పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|