|
| 80వ పడిలో అడుగిడిన సోమనాథ్ |
| న్యూఢిల్లీ(ఏజెన్సీ), 25 జులై 2008 ( 12:55 IST ) | |
లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ శుక్రవారంతో 80 యేటకు అడుగు పెట్టారు. రెండు రోజుల కిందటే సీపీఎం పార్టీ నుంచి ఆయన బహిష్కృతికి గురైన విషయం తెలిసిందే. అక్బర్ రోడ్డులోని తన నివాసంలోని ఆయన ఉదయం నుంచి పలువు నాయకులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రత్యేక అధికారి ద్వారా సోమనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు పంపారు.
ప్రత్యేక బొకేను పంపారు. సోమనాథ్ 1929 జూలై 25న అస్సాం రాష్ట్రంలోని తేజ్‌పూర్‌లో జన్మించారు. ఆయనను గురువారం నాబార్డు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చటర్జీ తండ్రి ఎన్‌సి చటర్జీ హిందూ మహాసభ నాయకుడు. ఆయన విద్యాభ్యాసం కోల్‌కత్తా, ఇంగ్లాండులలో జరిగింది. న్యాయశాస్త్రంలో ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా పొందారు.
1968లో ఆయన సీపీఎం పార్టీలో చేరారు. ఆ తరువాత ఆయన లోక్‌సభకు ఎన్నకవుతూ వస్తున్నారు. 1984లో ఒక్కమారు మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. తాజా పరిణామాల కారణంగా పార్టీ ధిక్కారణ కారణాలు చూపుతూ రెండు రోజుల కిందట ఆయనపై సీపీఎం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|