యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పదవిని వివాదం చేయడం మా ఉద్దేశ్యం కాదు
హైదరాబాద్‌, శుక్రవారం, 25 జులై 2008   ( 09:49 IST )
రాజ్యాంగబద్దంగా ఉన్న పదవులను వివాదం చేయడం తమ ఉద్దేశ్యం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ అన్నారు. స్పీకర్ పదవి అంటే ఎవరికైనా గౌరవమేనన్నారు. తమ పార్టీ సభ్యునిగా సోమనాథ్‌పై చర్య తీసుకున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలకు కరత్‌ హాజరయ్యారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమనాథ్‌ చటర్జీని పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. అయితే తప్పు మాత్రం కాదని అభిప్రాయపడ్డారు. అణు ఒప్పందం నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని పార్టీ తీర్మానించిందన్నారు.

ఇదే విషయం పార్టీ సభ్యుడైన లోకస్‌భ స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీకి తెలియజేశామన్నారు. పార్టీ సభ్యుడిగానైనా, లేదా స్పీకర్‌గానైనా ఉండాలని 19,20 తేదీలలో సమావేశమైన కమిటీ తీర్మానించింది. ఇదే విషయాన్ని సోమనాథ్‌కు చెప్పినట్లు కారత్ వివరించారు. పార్టీ సభ్యునిగా ఉండాలంటే విశ్వాస పరీక్షకు ముందే స్పీకర్ పదవికి సోమనాథ్ రాజీనామా చేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు ఆయన వివరించారు. ఆయన ఆ పనిచేయలేదు.

ఇలా పరిస్థతులలో చర్యలు తప్పని సరి అయ్యిందన్నారు. సోమనాథ్‌ చటర్జీని పార్టీ నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. తమ పార్టీ సభ్యునిగా ఆయనపై చర్య తీసుకున్నామే తప్ప లోకస్‌భ స్పీకర్‌లాంటి రాజ్యాంగబద్ధమైన పదవి విషయంలో వివాదాస్పదం చేయాలన్నది తమ ఉద్దేశం కాదని వివరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లంచం ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేయండి : స్పీకర్
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి
గ్రేనెడు దాడి: శ్రీనగర్‌లో ఐదుగురు మృతి
సోమనాథ్‌ను కలసిన ప్రధాన మంత్రి
మానవహక్కుల ఉల్లంఘనపై కాశ్మీర్ మహిళల ఆందోళన
అమర్‌నాథ్ వివాదం: జమ్ము బంద్‌
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...