యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
లంచం ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేయండి : స్పీకర్
న్యూఢిల్లీ ( ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 16:04 IST )
విశ్వాస పరీక్షలో తమను ప్రభావితం చేయడానికి డబ్బులు ఎరగా చూపిన వారిపై తనకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ బీజేపీ ఎంపీలను కోరారు. ఈ మేరకు వారికి బుధవారం రాత్రి లేఖ రాశారు. అధికారకంగా వారి వాదన వినిపించాలని సూచించారు.

యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న ఎస్పీ తమను డబ్బుతో కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని లోక్‌సభ సభ్యులు అశోక్ అర్గాల్, మహావీర్ బాగోరా, ఫగాన్ సింగ్ కులస్తేలు ఆరోపించిన విషయం తెలిసిందే. కోటి రూపాయల సొమ్మును పార్లమెంటులో ప్రదర్శించారు. దీనిపై స్పందించిన స్పీకర్ వారికి లేఖ రాశారు.

ఇది చాలా నీచమైనదని పైగా దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. కాబట్టి దీని నిగ్గు తేల్చడానికి సహకరించాలని వారిని కోరారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని వారికి పంపిన లేఖలో తెలిపారు. దురదృష్టకరమైన ఈ సంఘటనపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. తనకు డబ్బు అమర్ సింగ్ కూడా ప్రధాన పాత్ర పోషించాడని ఎంపీ అశోక్ అర్గాల్ తాజాగా ఆరోపించారు
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి
గ్రేనెడు దాడి: శ్రీనగర్‌లో ఐదుగురు మృతి
సోమనాథ్‌ను కలసిన ప్రధాన మంత్రి
మానవహక్కుల ఉల్లంఘనపై కాశ్మీర్ మహిళల ఆందోళన
అమర్‌నాథ్ వివాదం: జమ్ము బంద్‌
సేతసముద్రం: కట్టిన రాముడే కూల్చాడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...