యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి
న్యూఢిల్లీ, 24 జులై 2008   ( 15:46 IST )
భారతీయ జనతా పార్టీకు చెందిన లోక్ సభ సభ్యుడు చంద్రభాను ప్రకాశ్ ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం దాడి చేశారు. యూపీఏకు అనుకూలంగా ఓటు చేశారన్న ఉక్రోశంతోనే ఈ దాడి జరిగింది. దాడిలో ఇంటిపైకి రాళ్ళు విసిరారు.

అవిశ్వాస తీర్మానంలో చంద్రభాను ప్రకాశ్ పార్టీ విప్‌ను ఖాతరు చేయలేదు. యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారు. ఈయన మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని అధిష్టానం బుధవారం ప్రకటించింది.

దీంతో ఇండోర్‌లోని ఆయన ఇంటి వద్దకు దాదాపు వందమంది బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఇంటిపై దాడికి దిగారు. సెక్యూరిటీ వారిస్తున్నా లెక్క చేయలేదు. పెద్దపెద్ద ఇటుక రాళ్ళను విసిరారు. దీనిపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లంచం ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేయండి : స్పీకర్
గ్రేనెడు దాడి: శ్రీనగర్‌లో ఐదుగురు మృతి
సోమనాథ్‌ను కలసిన ప్రధాన మంత్రి
మానవహక్కుల ఉల్లంఘనపై కాశ్మీర్ మహిళల ఆందోళన
అమర్‌నాథ్ వివాదం: జమ్ము బంద్‌
సేతసముద్రం: కట్టిన రాముడే కూల్చాడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...