|
| గ్రేనెడు దాడి: శ్రీనగర్‌లో ఐదుగురు మృతి |
| శ్రీనగర్ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008 ( 15:19 IST ) | |
వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళడానికి జనం బిజీ బిజీగా ఉన్నారు. బ్యాగులు, పిల్లలను చేతపట్టుకుని బస్సుల కోసం వేచి ఉన్నారు. కొందరైతే దగ్గరకు వస్తున్న బస్సులను ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే పెద్ద శబ్ధం. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో హాహా... కారాలు. అరుపులు కేకలు.... కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు.
తిరిగి చూసే సమయానికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు పెద్దలు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక మహిళ. మరి కొందరు విఘత జీవులుగా గాయాలతో ఎడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు. ఈ దృశ్యాలన్నీ శ్రీనగర్‌కు చెందిన లాల్ చౌక్ పరిధిలోని బతామలూ బస్టాండు సమీపంలో చోటు చేసుకున్నవి. ఇక అసలు విషయానికొస్తే, గురువారం 12 గంటలకు బతామలూ బస్టాండు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు వారి వారి ప్రాంతాలకు బయలుదేరడానికి ఎక్కుతున్నారు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తులు గ్రేనెడ్ విసిరారు. దీంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. దాదాపు 18 మంది గాయాల పాలయ్యారు. మృతి చెందిన వారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
వారిలో మృతి చెందిన ఇద్దరు పిల్లల ఖుష్భూ, ఆదిల్‌లు అఫ్రోజ్ అనే వ్యక్తి పిల్లలుగా గుర్తించారు. దాడిలో గాయపడ్డ ఆయన కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లల మృతి చెందారనే విషయం తెలియగానే అఫ్రోజ్ కోమాలోకి వెళ్ళి పోయారు. మృతుల్లో మహిళను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంతవరకూ బాధ్యత వహించలేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|