|
| మానవహక్కుల ఉల్లంఘనపై కాశ్మీర్ మహిళల ఆందోళన |
| శ్రీనగర్ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008 ( 14:33 IST ) | |
కాశ్మీర్ లోయలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ గురువారం మహిళలు ఆందోళనకు దిగారు. శ్రీనగర్ రోడ్లలో ప్రదర్శనలు జరిపారు. ఈ ఆందోళన ముస్లిం ఖవాతీన్-ఇ-మర్కజ్ ఆధ్వర్యంలో జరిగింది. గత 19 యేళ్ళ కాలంలో సైనిక బలగాలు అమాయక కాశ్మీరీలపై దాడులు పెంచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్‌కు అనుబంధ సంస్థ అయిన ఖవాతీన్-ఇ-మర్కజ్ రాజ్‌బాగ్ ప్రాంతంలో జరిపిన ప్రదర్శన జరిపింది. ఈ సందర్భంగా అందోళనకు సారథ్యం వహించిన నాయకులు మాట్లాడుతూ, అమాయకులైన కాశ్మీరలపై చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పచ్చ రిబ్బన్లు తలకు ధరించిన మహిళలు రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పడిపోతున్న మానహక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది కారాగారాలలో అక్రమంగా మగ్గుతున్నారని హఫీజా జాన్ ఆరోపించారు. చట్టవ్యతిరేకంగా సైన్యం, పోలీసులు అదుపులోకి తీసుకున్న చాలా మంది ఆచూకీ తెలియడం లేదని ఆయన విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|