|
| సేతసముద్రం: కట్టిన రాముడే కూల్చాడు |
| న్యూఢిల్లీ, గురువారం, 24 జులై 2008 ( 11:08 IST ) | |
రామసేతను నిర్మించిన రాముడే దానిని కూల్చేశాడని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానిస్తోంది. ప్రభుత్వం తరుపు న్యాయవాది ఈ విషయాన్ని బుధవారం సుప్రీం కోర్టులో తెలిపారు. ఈ వాదన దేశంలో కొత్త వివాదానికి దారితీస్తోంది. సేతు సముద్రంపై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇందులో భాగంగా ప్రభుత్వం తరుపున న్యాయవాది నారీమన్ తనవాదనను ధర్మాసనం ముందు వినిపించారు.
పద్మపురాణం, కంభ రామాయణాలను ఊటంకిస్తూ రామసేతు నిర్మించింది రాముడేనని, కానీ సీతను తీసుకు వచ్చిన తరువాత ఒకే బాణంతో దానిని మూడు ముక్కలు చేశారని తెలిపారు. లంకేయులు ఇటు వైపు రాకుండా ఆయన అలా చేశారని తెలిపారు. అలాంటప్పుడు దానిని తాము కూల్చడమేమిటని ప్రశ్నించారు.
అన్ని పరిశీలించిన మీదటే తాము ప్రాజెక్టు నిర్మాణానికి వెళ్ళుతున్నామన్నారు. రామసేతును జాతీయ వారసత్వంగా ప్రకటించరాదని కోరారు. దీనిపై స్పందించిన ప్రజల విశ్వాసాలను, పర్యావరణాలను సమతుల్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరించాలని జస్టీస్ రవీంద్ర వ్యాఖ్యానించారు. ఎక్కడా జనం విశ్వాసాలు దెబ్బతినరాదని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా కట్టడాలను కూల్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|