|
| వామ పక్షాలది చారిత్రక తప్పిదం: ఠాక్రే |
| పూణే, 24 జులై 2008 ( 10:34 IST ) | |
మన్మోహన్ సింగ్, సంకీర్ణ ప్రభుత్వంపై కోపంతో వామపక్షాలు చారిత్రక తప్పిదానికి శ్రీకారం చుట్టాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే వారు చేసిన తప్పని బాల్‌ఠాక్రే పేర్కొన్నారు. ఆమె చాలా ప్రమాదకారి అన్న విషయాన్ని వామపక్షాలు విస్మరించాయన్నారు. విశ్వాసపరీక్షలో ప్రభుత్వంలో గెలుపు ప్రభుత్వానిది కాదన్నారు.
వ్యాపారవేత్తల ధనమే దేశ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించాయని విమర్శించారు. ఇది జాతికి ఏమాత్రం శుభ పరిణామం కాదన్నారు. పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాబోయే ప్రధానిగా మాయావతిలో ఆశలు రేకెత్తించారని తెలిపారు. కాంగ్రెస్‌పై పైచేయి సాధించేందుకు మయావతి లాంటివారిని తలకెత్తుకోవడం విపరిణామాలకే దారి తీస్తుందని హెచ్చరించారు. భారత్‌ను బానిసగా మార్చుకునేందుకు చైనాప్రయత్నాలను ఎందకు అడగరని ప్రశ్నించారు.
అమెరికాతో స్నేహం అంటే మాత్రం ఉలిక్కిపడుతున్నాయని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు బుష్‌పై విమర్శలు చేసే వామపక్షాలు నందిగ్రాం విషయంలో వారు చేసిందేమిటో గుర్తెరగాలని పేర్కొన్నారు. ప్రధాని వ్యక్తిగతంగా మంచివాడనని ఆయన చుట్టూ అపర ధుర్యోధనులు చేరారని విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|