యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
చట్టసభ ప్రతిష్ట మంటగలుస్తోంది: ఓమర్ అబ్ధుల్లా
న్యూఢిల్లీ,, గురువారం, 24 జులై 2008   ( 10:13 IST )
పార్లమెంట్‌ సభ్యుల వ్యవహార శైలి నానాటికి దిగజారుతోందని, వారు ఇలాగే వ్యవహరిస్తే చట్టసభల ప్రతిష్ట మంటకలవడం ఖాయమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. వారిని వ్యభిచారులు, లంచగొండులుగా భావించే పరిస్థితి ఎంతో దూరంలో లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్‌లో లంచం సొమ్మంటూ సభలోనే నోట్లకట్టలను బీజేపీ ఎంపీలు ప్రదర్శించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

ఇలాంటి చౌకబారు సంఘటనల వల్లే చట్టసభ ప్రతిష్ఠ దిగజారుతుందని హెచ్చరించారు. ఈ సంఘటన వల్ల సభ్యల గౌరవానికి భంగం వాటిల్లుతుందని చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగా పదేళ్ల పదవీకాలంలో ఇలాంటి నీతిబాహ్యమైన సంఘటనను ఇంతకుముందెన్నడూ చూడలేదన్నారు. గెలుపోటములు ఎలా ఉన్నా ఈ సంఘటన చరిత్రలో మాయని మచ్చేనని అభిప్రాయపడ్డారు.

తన పార్టీ యూపీఏలో భాగస్వామ్య పక్షం కాకపోయినా ప్రభుత్వానికి ఒమర్‌ అనుకూలంగా ఓటు వేశారు. బీఎస్పీ అధినేత మాయావతి నేతృత్వంలో దిద్దుకుంటున్న మూడో కూటమి రాజకీయ సమీకరణాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అప్పుడే చెప్పలేమన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మరింత వేగంగా సంస్కరణలు : చిదంబరం
మూకుమ్మడి రాజీనామాలు తప్పువు: అద్వానీ
సోమనాథ్‌ చటర్జీని బహిష్కరించిన సీపీఎం
రాజీనామాపై ఇప్పటికి ఆలోచించ లేదు: సోమనాథ్
క్రాసింగ్ ఎఫెక్ట్: 8 మందిపై బీజేపీ వేటు
సోమనాథ్‌పై చర్యలకు రంగం సిద్ధం..?
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...