|
| బీఎస్పీలో కొందరు ఎంపీల మద్దతు యూపీఏకే: ఎస్పీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 20 జులై 2008 ( 17:45 IST ) | |
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాయావతి లెఫ్ట్ పార్టీలతో కలసి కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీ ఆదివారం ఏడు నుంచి ఎనిమిది మంది బీఎస్పీ ఎంపీలు తమకు మద్దతు ఇస్తున్నారని ప్రకటించి కలకలం సృష్టించింది. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) యూపీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న లోక్‌సభలో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కీలక మద్దతు ఇవ్వబోతున్న ఎస్పీ ఈ రోజు ప్రత్యర్థి పార్టీలోని 7 నుంచి 8 మంది ఎంపీలు తమకు అనుకూలంగా ఉన్నారని ప్రకటించడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ములాయం సింగ్ యాదవ్ ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొంత మంది ఎంపీలు పార్టీని వీడిపోయినప్పటికీ, బయటి పార్టీల నుంచి వచ్చి తమకు మద్దతుగా నిలిచిన ఎంపీల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉందని ములాయం సింగ్ చెప్పారు.
టీవీ కెమేరాలు ఉండని వెనుక డోర్‌ల నుంచి బీఎస్పీకి చెందిన ఎంపీలు తమ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారని ములాయం సింగ్ యాదవ్‌తో పాటు విలేకరుల సమావేశానికి హాజరైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. 22న జరగబోయే విశ్వాసపరీక్ష కోసం యూపీఏ కూటమి ఇప్పటివరకు 287 మంది ఎంపీల మద్దతు కూడగట్టిందని ములాయం సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూపీఏ కూటమి ప్రభుత్వానికి విశ్వాసపరీక్షను గట్టెక్కేందుకు 271 మంది ఎంపీల మద్దతు మాత్రమే అవసరమైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసిన ఈ ప్రకటనను యూపీ ముఖ్యమంత్రి మాయావతి తోసిపుచ్చారు. తమ పార్టీకి చెందిన 17 మంది సభ్యులు ఏకాభిప్రాయంతో ఉన్నారని, వారందరూ యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని స్పష్టం చేశారు. విశ్వాసపరీక్షలో తమ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు వారందరూ ఈ రోజు ఇక్కడ జరిగిన సమావేశానికి హాజరయ్యారని అయ్యారని తెలిపారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 17 మంది ఎంపీలు హాజరయ్యారని యూఎన్‌పీఏ- లెఫ్ట్- బీఎస్పీ పార్టీల సమావేశం అనంతరం మాయావతి విలేకరులతో చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|