యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌: ఆర్మీ మేజర్, కానిస్టేబుల్ మృతి
జమ్ము (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 16:44 IST )
జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరి జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్ ఒకరు, ఒక పోలీసు కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ముగ్గురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాజౌరిలో లష్కరే తోయిబా తీవ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.

ఐదు నుంచి ఆరుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులు తలదాచుకున్నారని అందిన సమాచారం ఆధారంగా భద్రతా దళాలు జిల్లాలోని థానమండి ప్రాంతంలో ఉన్న కుందా- పాంగై అడవిలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయని భద్రతాధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఇంతకు ముందురోజు హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థ శ్రీనగర్- బారముల్లా రహదారిపై జరిపిన బాంబు దాడిలో తొమ్మిది మంది ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. మరో 20 మంది జవాన్లు ఈ దాడిలో గాయపడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సభాపక్ష నేతల సమావేశానికి సోమనాథ్ పిలుపు
యూఎన్పీఏ- లెఫ్ట్- బీఎస్పీ సమావేశం: కుమారస్వామి హాజరు
ప్రభుత్వానికి వ్యతిరేకం, విప్ జారీ చేయం: ఏజీపీ
యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఆర్ఎల్‌డీ ఓటు
యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేయాలని జేఎంఎం నిర్ణయం
యూపీఏకే నా ఓటు: మాజీ కేంద్ర మంత్రి మారన్ వెల్లడి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...