యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఆర్ఎల్‌డీ ఓటు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 15:09 IST )
లోక్‌సభలో ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్షలో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) అధికార యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకుంది. విశ్వాసపరీక్షలో ముగ్గురు ఎంపీల బలం ఉన్న ఆర్ఎల్‌డీ ఎటువైపు మొగ్గుతుందనే దానిపై ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠ ఆదివారం తొలగిపోయింది. తమ సభ్యులు యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆర్ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్ ప్రకటించారు.

పార్టీ ఎంపీలతో సంప్రదింపుల అనంతరం అజిత్ సింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు మద్దతిస్తున్న కారణంగా తాము వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు అజిత్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని కూడా ఎస్పీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ నడుపుతున్నారని విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ వారి వెంట ఉండటమే తాము ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణమని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేయాలని జేఎంఎం నిర్ణయం
యూపీఏకే నా ఓటు: మాజీ కేంద్ర మంత్రి మారన్ వెల్లడి
మాకు 291 మంది సభ్యుల మద్దతు ఉంది: యూపీఏ
సోనియాతో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ చర్చలు
ప్రత్యామ్యాయంపై రేపు లెఫ్ట్, యూఎన్‌పీఏ, బీఎస్పీ చర్చలు
బీఎస్పీలో ఎస్పీ ప్రధానకార్యదర్శి షాహిద్ సిద్దిఖి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...