యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేయాలని జేఎంఎం నిర్ణయం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 15:02 IST )
లోక్‌సభలో ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్షలో జేఎంఎం ఎంపీలు ఎవరికి ఓటు వేయనున్నారనే దానిపై ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠ ఆదివారం తొలగిపోయింది. విశ్వాసపరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని జేఎంఎం నిర్ణయించుకుంది.

కేంద్ర మంత్రివర్గంలో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు మళ్లీ చోటు కల్పించేందుకు కాంగ్రెస్ అంగీకరించడంతో ఇది సాధ్యపడింది. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో శిబు సోరెన్ ఆదివారం ఉదయం ఆమె నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం శిబు సోరెన్ మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు బలపరీక్షలో యూపీఏకు అనుకూలంగా ఓటు వేస్తారని ప్రకటించారు.

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బాధ్యతలను తాను మళ్లీ చేపట్టనున్నానని, ఇందుకు యూపీఏ నాయకత్వం అంగీకరించిందని శిబు సోరెన్ తెలిపారు. అంతేకాకుండా తమ పార్టీకి కేంద్ర సహాయమంత్రి పదవి కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. సహాయమంత్రి పదవి పార్టీలో ఎవరికి అప్పగిస్తారనే దానిపై మాట్లాడేందుకు శిబు సోరెన్ నిరాకరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూపీఏకే నా ఓటు: మాజీ కేంద్ర మంత్రి మారన్ వెల్లడి
మాకు 291 మంది సభ్యుల మద్దతు ఉంది: యూపీఏ
సోనియాతో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ చర్చలు
ప్రత్యామ్యాయంపై రేపు లెఫ్ట్, యూఎన్‌పీఏ, బీఎస్పీ చర్చలు
బీఎస్పీలో ఎస్పీ ప్రధానకార్యదర్శి షాహిద్ సిద్దిఖి
విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని రాజీనామా చేయరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...