|
| యూపీఏకే నా ఓటు: మాజీ కేంద్ర మంత్రి మారన్ వెల్లడి |
| చెన్నై (ఏజెన్సీ), 20 జులై 2008 ( 13:56 IST ) | |
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికే తాను ఓటు వేస్తానని మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ ఆదివారం ప్రకటించారు. ఈ నెల 22న యూపీఏ కూటమి ప్రభుత్వం లోక్‌సభలో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకేకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న మారన్ విశ్వాసపరీక్షలో ఓటు ఎవరికి వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ తాను యూపీఏకు అనుకూలంగా ఓటు వేయనున్నట్టు మారన్ ఆదివారం ప్రకటించారు. అంతకుముందు మారన్ కూడా తమ మిగిలిన ఎంపీలతోపాటే యూపీఏకు అనుకూలంగా ఓటు వేయాలని డీఎంకే ఇప్పటికే విప్ జారీ చేసింది. దయానిధి మారన్ ఈ విప్‌కులోబడి యూపీఏకు అనుకూలంగా ఓటు వేస్తారని డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్ర మంత్రి టీఆర్ బాలు పేర్కొన్నారు.
విశ్వాసపరీక్షలో ఎవరికి ఓటు వేయాలనే దానిపై డీఎంకే ఇప్పటివరకు దయానిధి మారన్‌ను సంప్రదించలేదని జరుగుతున్న ప్రచారాన్ని టీఆర్ బాలు ఈ సందర్భంగా తోసిపుచ్చారు. అందరు ఎంపీలకు విప్ జారీ చేశామని, మారన్ కూడా ఈ లికితాదేశానికి లోబడి నడుచుకోవాలని అన్నారు. విప్ గురించి మారన్‌కు కూడా తెలుసు అని, విశ్వాసపరీక్షకు వచ్చి ఓటు వేస్తారని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|