|
| విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని రాజీనామా చేయరు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 జులై 2008 ( 16:42 IST ) | |
విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ రాజీనామా చేస్తారన్న వార్తలను కాంగ్రెస్ శనివారం తోసిపుచ్చింది. బలపరీక్షలో గెలుపు తథ్యమన్న నమ్మకం తమకు ఉన్నందున ఈ ప్రశ్నకు అసలు చోటే లేదని ఆ పార్టీ పేర్కొంది.
పార్టీ మీడియా విభాగం చీఫ్ వీరప్ప మొయిలీ మాట్లాడుతూ గౌరవార్థంగానే పార్టీ ఎంపీలు సోనియాతో సమావేశమవుతున్నారన్నారు. అణు ఒప్పందం ప్రయోజనాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే పరిణితి వారికి ఉందని చెప్పారు.
శివసేన, అకాలీదళ్, బీజేపీలకు చెందిన కొందరు ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటారని తమకు సమాచారం అందిందని, కానీ వారి పేర్లు వెల్లడించలేమన్నారు. జేఎంఎం ఇప్పటివరకు తమతోనే ఉందని, అజిత్ సింగ్ సొంత నిర్ణయం తీసుకోగలరని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|