|
| యూపీఏ సర్కారుకు 291 ఎంపీల మద్దతు: లాలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 15:49 IST ) | |
యూపీఏ సర్కారుకు లోక్‌సభలో 291 మంది సభ్యుల మద్దతు ఉందని కేంద్ర రైల్వే మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. విశ్వాసపరీక్షలో ప్రభుత్వం తప్పక విజయం సాధిస్తుందన్నారు.
ఆయన శనివారం మాట్లాడుతూ తామందరం ప్రధాని వెనుక గట్టిగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం శిబు సోరెన్ కూడా తమతో చేతులు కలుపుతున్నారన్నారు. యూపీఏను చీల్చేందుకు ఎన్ని ఎత్తులు వేసినా, విశ్వాస పరీక్షలో తాము విజయం సాధించడం ఖాయమన్నారు.
సీపీఐ నేత బర్ధన్ చేసిన పని పెద్ద పొరబాటు అన్నారు. లెఫ్ట్ వృద్ధ నేత జ్యోతిబసు సలహాను కూడా పెడచెవిన పెట్టిన ఆయనను చరిత్ర ఎన్నటికీ క్షమించదన్నారు. ఆర్జేడీలో చీలిక సంభవించే పరిస్థితి లేదన్నారు. ప్రధాని కావాలనే మాయా ఆశలు నెరవేరబోదని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|