|
| మరో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ తిరుగుబాటు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 15:35 IST ) | |
యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్న పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ ధిక్కరించారు. లోక్‌సభలో విశ్వాసపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు జాలేశ్వర్ ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ ప్రకటించారు.
ములాయంకు అత్యంత సన్నిహితుడిగా చెప్పే బఘేల్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశానికి కూడా హాజరైన ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. పార్టీ విప్‌ను ధిక్కరిస్తానన్నారు.
ఆయనతో కలిపి భారత్- అమెరికా అణు ఒప్పందంపై కేంద్రానికి మద్దతు ఇవ్వాలన్న పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిర్ణయాన్ని సవాలు చేస్తున్న ఎంపీల సంఖ్య నాలుగుకు చేరింది.
ఇప్పటికే ముజాఫర్ నగర్ ఎంపీ మున్నావర్ హుస్సేన్, మోహన్‌లాల్ గంజ్ ఎంపీ జై ప్రకాష్ రావత్, హమీర్‌పూర్ ఎంపీ నారాయణ్ బుధోలియాలు తమ వ్యతిరేకతను తెలిపిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|