|
| తటస్థుల మద్దతు లౌకిక పార్టీలకే: పాశ్వాన్ విశ్వాసం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 జులై 2008 ( 13:20 IST ) | |
తటస్థ సభ్యుల మద్దతు లౌకిక పార్టీలకే ఉంటుందని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ నేత రాం విలాస్ పాశ్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే 276 మంది సభ్యుల మద్దతు ఉండగా, మరో ఐదుగురి మద్దతు కూడా లభించే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఢిల్లీలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా తమకే మద్దతు ఇస్తుందన్నారు. విశ్వాస పరీక్ష ఫలితం ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుందన్నారు.
న్యూయార్క్‌లో జరిగిన దళిత్, మైనారిటీల ఫోరం ఐదో అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం పాశ్వాన్ ఢిల్లీ తిరిగొచ్చారు. ఈ సదస్సులో చేసిన తీర్మానాల అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన సారథ్యం వహించనున్నారు.
అంటరానితనం నిర్మూలన, ఉచిత, నాణ్యమైన విద్య, దళితులు, మైనారిటీల మానవహక్కుల పునరుద్ధరణ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల రిజర్వేషన్ వంటి అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|