|
| యూపీఏకు వ్యతిరేకంగా ఓటు: ఆరెస్పీ విప్ జారీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 13:09 IST ) | |
యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ పార్టీకి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులకు రివొల్యూషనరీ సోషలిస్టు పార్టీ శనివారం విప్ జారీ చేసింది. జులై 22న జరిగే విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ విప్‌లో పేర్కొంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రచూడన్ శనివారం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టే జూలై 21, 22తేదీలలో పార్టీ ఎంపీలు లోక్2సభ సమావేశాలకు హాజరుకావాలని కోరారు.
పార్టీకి చెందిన పశ్చిమ బెంగాల్ ఎంపీలైన రానేన్ బర్మన్, జోవాచిమ్ బక్స్‌లా, సనత్ కుమార్ మండల్‌లు ఆదివారం నాటికి రాజధాని ఢిల్లీ చేరుకుంటారని వెల్లడించారు. ఇప్పటికే సీపీఎం, సీపీఐ ఇదే తరహాలో తమ,తమ పార్టీల ఎంపీలకు విప్‌లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|