|
| పార్టీ ఎంపీలతో సోనియా సమావేశాలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 జులై 2008 ( 13:01 IST ) | |
యూపీఏ సర్కారు జూలై 22న విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బ్యాచ్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జన్‌పథ్‌లోని తన నివాసంలో ఆమె వారితో విస్తృతంగా చర్చిస్తున్నారు.
విశ్వాసపరీక్ష సందర్భంగా సమైక్యంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆమె పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ఓ వైపు యూపీఏ సర్కారు మెజారిటీ మార్కును చేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో ఆమె ఈ సమావేశాలు నిర్వహించడం గమనార్హం.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేత శిబుసోరెన్ కేంద్ర మంత్రి పదవికోసం పట్టుబడుతుండగా, తమ పార్టీ ఎంపీలందరూ యూపీఏ వెంటే ఉన్నారని ఆ పార్టీ చీఫ్ విప్, గిరిధ్ ఎంపీ తెక్లాల్ మహతో స్పష్టం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|