|
| పార్టీ విప్ స్పీకర్‌కు వర్తించదు: బోస్ |
యూపీఏ ప్రభుత్వంపై విశ్వాసపరీక్షకు సంబంధించి తమ పార్టీ జారీ చేసిన విప్ స్పీకర్‌కు వర్తించదని సీపీఎం స్పష్టం చేసింది. లోక్‌సభ స్పీకర్ పదవిలో ఉన్నందున ఈ విప్ నుంచి ఆయనకు స్వతస్సిద్ధంగానే వర్తించదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బిమన్ బోస్ తెలిపారు.
కోల్‌కతలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీతో కలసి ఓటు చేయడానికి వ్యతిరేకంగా తాను ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదని పశ్చిమబెంగాల్ రవాణా మంత్రి సుభాష్ చక్రవర్తి స్పష్టం చేయడంతో ఆయన అభిప్రాయాలపై ఈ సమావేశంలో ఎక్కడా చర్చించలేదని వెల్లడించారు.
ఈ సమావేశంలో విశ్వాస పరీక్ష సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోమ్‌నాథ్ ఛటర్జీ వివాదం అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది. అనారోగ్యం కారణంగా పార్టీ వృద్ధనేత జ్యోతిబసు ఈ సమావేశానికి హాజరు కాలేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|