యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఎస్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కొందరు గైర్హాజరు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 16:41 IST )
లోక్‌సభలో ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి కీలకమైన మద్దతును ఇవ్వబోతున్న సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటరీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో వింత పరిస్థితి నెలకొంది. పార్టీకి చెందిన 39 మంది ఎంపీల్లో 12 మంది ఎంపీలు వేర్వేరు కారణాలతో ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

ఓవైపు యూపీఏకు మద్దతు ఇవ్వడంపై కొందరు పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తుండగా, ఈరోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కొందరు ఎంపీలు హాజరుకాకపోవడం కలకలం రేకెత్తించింది. అయితే దీనిపై ములాయం సింగ్ మాట్లాడుతూ మొత్తం 39 మంది ఎంపీల్లో 12 మంది వేర్వేరు కారణాలతో సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపారు.

దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఎంపీలందరికీ ఈ నెల 21,22 తేదీల్లో జరిగే లోక్‌సభ సమావేశాలకు హాజరు కావాలని, యూపీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా విశ్వాసపరీక్షలో ఓటు వేయాలని విప్ (లికితాదేశం) జారీ చేసినట్టు ములాయం సింగ్ యాదవ్ తెలిపారు.

ఇదిలా ఉంటే ఎస్పీకి చెందిన మన్నావర్ హసన్ యూపీఏకు వ్యతిరేకంగా ఓటేస్తానని, పార్టీ విప్ తాను ఖాతరు చేయబోనని స్పష్టం చేశారు. తనతో పాటు మరో ఏడుగురు ఎంపీలు విశ్వాసపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని మున్నావర్ పేర్కొనడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రేపు ప్రధాని మన్మోహన్‌ను కలుసుకోనున్న దేవెగౌడ
ఎస్సీ సమావేశానికి 16 మంది ఎంపీలే హాజరు
జేడీఎస్ మద్దతు కోసం దేవెగౌడతో మాట్లాడిన ప్రధాని
ఎంపీలకు సీపీఎం విప్: సోమనాథ్‌కు మినహాయింపు
దేరా- సిక్కుల మధ్య ఘర్షణ: పంజాబ్‌లో అప్రమత్తత
పీఎం స్కామ్‌: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...