|
| జేడీఎస్ మద్దతు కోసం దేవెగౌడతో మాట్లాడిన ప్రధాని |
| బెంగుళూరు (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008 ( 15:37 IST ) | |
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడతో టెలిఫోన్‌లో మాట్లాడారు. లోక్‌సభలో ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ జేడీఎస్ నేతను కోరారు.
జేడీఎస్‌కు ముగ్గురు ఎంపీల బలం ఉంది. శుక్రవారం ఉదయం తమ పార్టీ అధ్యక్షుడు దేవెగౌడకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోన్ చేశారని జేడీఎస్ ప్రతినిధి వైఎస్‌వీ దత్తా విలేకరులతో చెప్పారు. విశ్వాసపరీక్షలో యూపీఏకు మద్దతివ్వాలా వద్దా అనే దానిపై జేడీఎస్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోని సంగతి తెలిసిందే.
తాజాగా ప్రధాని మన్మోహన్ తానే స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి మద్దతు కోరారు. దీనిపై దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరివైపుకు చేరే ప్రసక్తే లేదని, ఈ రెండు పార్టీల వలన తాము తీవ్రంగా నష్టపోయామని దేవెగౌడ ఇంతకుముందు ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|