|
| పీఎం స్కామ్: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008 ( 10:21 IST ) | |
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ పీఎఫ్ స్కామ్‌లో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో పాటు న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 1న జరగనుంది. ఈలోగా నోటీసులకు స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|