|
| శిక్షలు పడ్డ ఎంపీలను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్: సీపీఎం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008 ( 09:55 IST ) | |
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో గట్టెక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ శిక్షలుపడ్డ ఎంపీలను కూడా ఉపయోగించుకుంటుందని సీపీఎం గురువారం విమర్శించింది. ప్రభుత్వాన్ని రక్షించేందుకు కాంగ్రెస్, కూల్చేందుకు లెఫ్ట్ గత కొన్నిరోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శిక్షలు పడిన ఎంపీలను కూడా ఉపయోగించుకొని బలపరీక్షలో నెగ్గడానికి ప్రయత్నిస్తుందని సీపీఎం విమర్శించింది. తీవ్రమైన నేరాల్లో శిక్షలు పడి, జైలు జీవితాలు గడుపుతున్న లోక్‌సభ సభ్యులను విశ్వాసపరీక్షలో తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో ఆరోపించింది.
శిక్షలు పడిన ఎంపీలు కూడా చట్టాల ప్రకారం లోక్‌సభలో ఓటు వేసేందుకు అర్హులే. అయితే ఇక్కడ రాజకీయ నైతిక విలువల గురించి ఆలోచించాలని సీపీఎం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలను దేశమంతా చూస్తుందని తెలిపింది. జైలు శిక్షలు అనుభవిస్తున్న ఎంపీలు పప్పు యాదవ్, షాహబుద్దీన్ (ఆర్జేడీ), సురజ్ భన్ (ఎల్‌జేపీ) లోక్‌సభలో ఓటు వేసేందుకు అనుమతి పొందడంపై సీపీఎం పైవిధంగా స్పందించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|