యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మాకెవరి సర్టిఫికేట్లు అవసరం లేదు: లెఫ్ట్‌తో సోనియా
నెల్లూరు (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 09:44 IST )
కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, దేశభక్తికి ఏ రాజకీయ పార్టీ నుంచి సర్టిఫికేట్లు అవసరం లేదని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉద్ఘాటించారు. ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వానికి అణు వివాదంపై మద్దతు ఉపసంహరించిన లెఫ్ట్ పార్టీలను ఉద్దేశించి సోనియా గాంధీ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అణు ఒప్పందాన్ని లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ మాట్లాడుతూ దేశ భద్రతా ప్రయోజనాలు, అణు కార్యక్రమం, విదేశాంగ విధానం విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వెళుతుందని వస్తున్న విమర్శలను సోనియా తిప్పికొట్టారు.

ఏ పార్టీ పేరును ప్రస్తావించని సోనియా తమ నిబద్ధతకు ఎవరి నుంచి సర్టిఫికేట్లు అవసరం లేదని వ్యాఖ్యానించారు. అణు ఒప్పందం విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వైఖరిని గట్టిగా సమర్థించారు. ఇతరదేశాల నుంచి అణు ఇంధనం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ పొందాల్సిన అవసరం ఉందని నెల్లూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా సోనియా తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బర్దన్, అజిత్ సింగ్ భేటి: ఎటూ తేల్చని ఆర్ఎల్‌డీ
మరో ఎనిమిది ఐఐటీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
పప్పు యాదవ్‌ ఓటేసేందుకు హైకోర్టు అనుమతి
ఆర్ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్‌తో బర్దన్ భేటి
మన్మోహన్ సింగ్ దిగిపోవాలి: సీపీఐ నేత డిమాండ్
ఒరిస్సాలో మావోల దాడి: 21 మంది పోలీసులు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...