|
| పాకిస్థాన్ సేనల కాల్పులు ఆందోళనకరం: ప్రధాని
|
| న్యూఢిల్లీ/ శ్రీనగర్ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008 ( 09:27 IST ) | |
పాకిస్థాన్ సేనలు ఎటువంటి కవ్వింపులేకుండానే భారత సేనలపై కాల్పులు జరపడం ఆందోళకరమని దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. జమ్మూ- కాశ్మీర్ ఉత్తర ప్రాంతంలో ఉన్న తంగ్‌ధార్ వద్ద ఉన్న భారత సైనిక స్థావరంపై పాకిస్థానీ సేనలు కాల్పులు జరిపాయి. గత వారం రోజుల్లో పాక్ సేనలు భారత దళాలపైకి కాల్పులు జరపడం ఇది రెండోసారి.
ఐదేళ్ల క్రితం నాటి కాల్పుల విరమణను ఇది ఉల్లంఘింటమేనని ప్రధాని మన్మోహన్ పేర్కొన్నారు. ఎటువంటి కవ్వింపు లేకుండా పాకిస్థాన్ సేనలు కాల్పులు జరపడం రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో జరగబోతున్న ఇరుదేశాల విదేశాంగ శాఖల చర్చల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని ప్రధాని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|