యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జైపూర్ పేలుళ్ల అనుమానితుడి ఊహాచిత్రం విడుదల
జైపూర్ (ఏజెన్సీ), గురువారం, 15 మే 2008   ( 09:07 IST )
రాజస్థాన్ బుధవారం జైపూరు్ వరుస బాంబు పేలుళ్ల అనుమానితుడి ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. మంగళవారం రాత్రి జైపూర్ నగరాన్ని వణికించిన బాంబు పేలుళ్ల వెనుక ఇతని హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

25 ఏళ్ల వయస్సు, మధ్యస్థాయి ఎత్తు కలిగిన ఈ యువకుడి ఊహాచిత్రాన్ని సైకిల్ షాపు యజమాని ఇచ్చిన ఆనవాళ్ల ఆధారంతో పోలీసుల తయారు చేశారు. పేలుళ్ల కోసం ఉపయోగించిన సైకిళ్లను ఈ సైకిల్ షాపులోనే కొన్నట్లు తేలింది.

జైపూర్‌లో బాంబు పేలుళ్ల కోసం తీవ్రవాదులు సైకిళ్లను ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఊహాచిత్రాన్ని అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఉంచుతామని రాజస్థాన్ హోంశాఖ మంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు.

ఈ పేలుళ్లకు సుమారు తొమ్మిది బృందాలు పనిచేసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. పేలుళ్లకు ఉపయోగించిన సైకిళ్లను నగరంలోని రెండు షాపులను నుంచి తీవ్రవాదులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఓ మహిళలో పేలుళ్లు జరిగిన హవామహల్ అనే ప్రదేశానికి సైకిల్ తీసుకెళ్లాలని తన వద్దకు వచ్చానట్టు పేలుళ్లలో గాయపడిన రిక్షా కార్మికుడు విజయ్ తెలిపాడు. పేలుళ్ల జరగడానికి 45 నిమిషాల ముందు తనవద్దకు ఈ మహిళ వచ్చిందని వెల్లడించాడు.

ప్రస్తుతం ఈ రిక్షా కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాము ఇప్పటికిప్పుడు ఈ పేలుళ్ల వెనుక ఏ తీవ్రవాద సంస్థ హస్తం ఉందో చెప్పడం కష్టమని రాజస్థాన్ హోంశాఖ మంత్రి పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బెంగాల్ పం.ఎన్నికల్లో హింసాకాండ: నలుగురు మృతి
పార్లమెంట్‌పై దాడి కేసు: షౌకత్ పిటిషన్‌కు తిరస్కృతి
జైపూర్: పోలీసుల అదుపులో 8 మంది అనుమానితులు
జైపూర్ పేలుళ్లు: హుజీ ప్రమేయంపై అనుమానాలు
బాంబు పేలుళ్లు: జైపూర్ నగరంలో కర్ఫ్యూ విధింపు
శాంతికి భంగం కలిగించేందుకు జరిగిన కుట్ర: రాజే
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...