|
| బెంగాల్ పం.ఎన్నికల్లో హింసాకాండ: నలుగురు మృతి |
| కోల్‌కత (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 16:32 IST ) | |
పశ్చిమబెంగాల్‌లో బుధవారం జరుగుతున్న రెండో దశ పంచాయితీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో నలుగురు మృతి చెందగా, సుమారు 15 మంది గాయపడ్డారు.
24 పరగణాల జిల్లాలో, హౌరా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు హింసాత్మక సంఘటనల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారని పశ్చిమబెంగాల్ పోలీసులు తెలిపారు. 24 పరగణాల జిల్లాలోని అంజారా గ్రామంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ భాగస్వాములైన సీపీఎం, ఆర్ఎస్‌పీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.
ఇక్కడి ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా, హౌరా జిల్లాలో జరిగిన ఘర్షణల్లో మరో వ్యక్తి మృతి చెందాడు. సీపీఎం కార్యకర్తలు జరిపిన దాడుల్లో తమ పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారని ఆర్‌ఎస్‌పీ నేత, రాష్ట్ర మంత్రి క్షితి గోస్వామి ఆరోపించారు. సీపీఎం కార్యకర్తలు తమ పార్టీ సభ్యులను ఓట్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|