|
| జైపూర్: పోలీసుల అదుపులో 8 మంది అనుమానితులు
|
| జైపూర్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 13:28 IST ) | |
జైపూర్ బాంబు పేలుళ్లకు సంబంధించి పోలీసులు ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీరికి, పేలుళ్లకు గల సంబంధాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బుధవారం జైపూర్ నగరంలోని 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.
జైపూర్‌లో బాంబు పేలుళ్ల మృతుల సంఖ్య బుధవారానికి 63కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో మరో 120 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి జైపూర్ నగరంలో ఆరు ప్రదేశాల్లో ఎనిమిది వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.
ఈ పేలుళ్ల కారణంగా మరణించినవారి సంఖ్య 63కు పెరిగిందని రాజస్థాన్ హోంశాఖ ప్రధాన కార్యదర్శి వీకే సింగ్ పీటీఐతో చెప్పారు. ఇదిలా ఉంటే అనధికారిక మృతుల సంఖ్య 85కు చేరింది. పేలుళ్లలో గాయపడినవారు సవాయ్ మాన్‌సింగ్ దుర్లబ్‌జీ మెమొరియల్ ఆస్పత్రులతో పాటు పలుచోట్ల చికిత్స పొందుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|