|
| శాంతికి భంగం కలిగించేందుకు జరిగిన కుట్ర: రాజే
|
| జైపూర్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 11:41 IST ) | |
జైపూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన వరుస బాంబు పేలుళ్లను రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు తీవ్రవాదులు పన్నిన కుట్ర అని వసుంధర రాజే పేర్కొన్నారు.
జైపూర్ బాంబు పేలుళ్లపై విలేకరుల సమావేశంలో రాజే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఈస్థాయి తీవ్రవాద దాడి మునెప్పన్నడూ జరలేదని రాజే తెలిపారు. ఇది రాజస్థాన్‌పై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని రాజే అభిప్రాయపడ్డారు.
ఈ కష్టసమయంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ తమకు అండగా నిలవాలని, పరిస్థితిని చక్కదిద్దేందుకు సహకరించాలని వసుంధర రాజే కోరారు. జైపూర్ బాంబు పేలుళ్లు 60 మంది అమాయకలు ప్రాణాలు బలితీసుకున్న సంగతి తెలిసిందే.
అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హోం మంత్రి శివరాజ్‌పాటిల్ ఈ దుర్ఘటనపై రాజేతో మాట్లాడారు. కేంద్ర అన్నిరకాలుగా బాంబు పేలుళ్లు బాధితులను ఆదుకుంటుందని వారు హామీ ఇచ్చారు. పోలీసులకు సాయం చేసేందుకు కేంద్రం పంపిన జాతీయ భద్రత దళ సిబ్బంది ఇక్కడకు వచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|