|
| కర్ణాటకలో ఊపందుకున్న రెండో దశ ఎన్నికల ప్రచారం
|
| బెంగుళూరు (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 16:00 IST ) | |
కర్ణాటక రాష్ట్రంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగియడంతో రెండో దశ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ సీట్లలో శనివారం 11 జిల్లాల్లోని 89 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నెల 16న జరగనున్న రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో మరో 10 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ఎన్నికలు 69 నియోజకవర్గాల్లో జరగబోతున్నాయి. మొదటి దశ ఎన్నికలపై వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఎన్డీటీవీ ఎగ్జిట్‌పోల్ బీజేపీ 89 స్థానాల్లో 31 స్థానాలు బీజేపీకి, జేడీఎస్‌కు 30, కాంగ్రెస్‌కు 25 స్థానాలు గెలుచుకుంటాయని వెల్లడించింది.
ఇదిలా ఉంటే అన్నిపార్టీల నాయకులు రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం నుంచే ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఉడిపి, దక్షిణకన్నడ జిల్లాల్లో పర్యటిస్తారు. బీజేపీ నేత బీఎస్ యోడ్యూరప్ప, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీవీ సదానంద గౌడ కూడా ఈ జిల్లాల్లోనే ప్రచారం నిర్వహిస్తారు.
కాంగ్రెస్ తరపున పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ నెల 13న ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆమె కొప్పాల్, మంగుళూరుల్లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రెండో దశ ఎన్నికలు రాయచూర్, కొప్పాల్, ఉత్తరకన్నడ, బళ్లారి, చిత్రదుర్గా, షిమోగ, ఉడిపి, చిక్‌మంగళూర్, దక్షిణకన్నడ జిల్లాల్లో జరగనున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|