|
| సాంబా సెక్టార్‌లో కాల్పులు: పెరిగిన మృతుల సంఖ్య
|
| సాంబా (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 15:36 IST ) | |
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని సాంబా సెక్టార్‌లో ఆదివారం తీవ్రవాదులు విరుచుకపడ్డారు. తీవ్రవాదుల కాల్పుల్లో ప్రముఖ దినపత్రిక ఫొటోగ్రాఫర్‌తో పాటు మొత్తం నలుగురు మృతి చెందారు. అంతేకాకుండా తీవ్రవాదులు ఇద్దరు మహిళలను నిర్బంధంలోకి తీసుకున్నారు.
భద్రతా దళాల జరిపిన కాల్పుల్లో ఒక తీవ్రవాది కూడా మృతి చెందాడు. శుక్రవారం ఇక్కడి బీఎస్ఎఫ్ స్థావరం వద్ద కాల్పుల అనంతరం దేశంలోకి చొరబడ్డట్టు అనుమానిస్తున్న తీవ్రవాదులు ఆదివారం ఉదయం స్థానిక రాజకీయ నాయకుని ఇంటిపై దాడి చేశారు.
ఆదివారం 7.50 గంటల ప్రాంతంలో హుషియార్ సింగ్ అనే రాజకీయ నాయకుని ఇంటిపై తీవ్రవాదులు దాడి చేశారని భద్రతా దళ అధికారులు చెప్పారు. తీవ్రవాదుల కాల్పుల్లో సింగ్, ఆయన భార్య శేషి బల్లా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడి సమాచారం అందుకున్న ఆర్మీ, బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు.
అనంతరం తీవ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య భీకర పోరు జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసేందుకు వెళ్లిన ఆంగ్ల దినపత్రిక ఫొటోగ్రాఫర్ అశోఖ్ సోధీ తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రవాదుల కాల్పుల్లో అతుల్ అనే జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడని ఆర్మీ సిబ్బంది తెలిపారు. మరో నాలుగురు ఆర్మీ సిబ్బంది ఈ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|