|
| నక్సల్స్‌పై పోరు కోసం ప్రత్యేక దళం; కేంద్ర ప్రభుత్వం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 13:00 IST ) | |
దేశంలో పెరుగుతున్న నక్సల్స్ హింసాకాండను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనుంది. వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు సీఆర్‌పీఎఫ్ కింద స్పెషల్ యాక్షన్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఈ ప్రతిపాదనకు త్వరలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ఈ ప్రతిపాదన కేంద్ర హోం శాఖ తుది ఆమోదం కోసం ఎదురుచూస్తుందని అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే దళంలో 10 బెటాలియన్లు (10 వేల మంది సిబ్బంది) ఉంటాయి.
దీనిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రేగ్రౌండ్స్ తరహాలో ఉంటుంది. ఈ దళం సీఆర్‌పీఎఫ్ కింద పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|