|
| కర్ణాటకలో 60 శాతం పోలింగ్: విజయంపై నేతల ధీమా
|
| బెంగుళూరు (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 11:36 IST ) | |
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో సుమారు 60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరిగిన 11 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో మొత్తం 1.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్.భట్టాచార్య విలేకరులతో చెప్పారు. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన వెల్లడించారు.
పట్ణణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 64 శాతం పోలింగ్ నమోదుకాగా, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది.
11 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 18,598 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను సుమారు 7700 మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించారు. శనివారం రైతులకు ఉచిత విద్యుత్ ప్రకటించినందుకు ఎన్నికల సంఘం కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు నోటీసు జారీ చేసింది.
ఎన్నికల సమయంలో ఈ ప్రకటన చేసి ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఈ నోటీసు జారీ చేయబడింది. 48 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలని షిండేను కోరామని భట్టాచార్య తెలిపారు. ఈ మొదటి దశ ఎన్నికల్లో ఆధిపత్యంపై అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
మళ్లీ హంగ్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఇప్పటివరకు చెబుతున్న జేడీఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఈ మొదటి దశ ఎన్నికల అనంతరం సాధారణ మెజారితీ తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా విజయంపై ధీమాగా ఉన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|