యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
రాజీనామా డిమాండ్‌లను తోసిపుచ్చిన రాందాస్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 8 మే 2008   ( 17:22 IST )
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ తాను రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్‌లను తోసిపుచ్చారు. గురువారం సుప్రీంకోర్టు ఎయిమ్స్ డైరెక్టర్ వేణుగోపాల్‌ను తొలగించేందుకు కేంద్రం చేసిన చట్టం చెల్లుబాటుకాదని, ఆయనను ఈ పదవిలో పునర్నియమించాలని తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ తీర్పు తనకేమీ ఎదురుదెబ్బ కాదని అన్బుమణి రాందాస్ స్పష్టం చేశారు. రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్‌లను తిరస్కరించారు. ఈ తీర్పును పూర్తిగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వమే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తుందని తెలిపారు. తమకింకా కోర్టు తీర్పు కాపీలు అందలేదని, అవి వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ చట్టం విషయంలో ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారనే ఆరోపణలను కూడా రాందాస్ ఈ సందర్భంగా తిరస్కరించారు. ఈ చట్టం తీసుకురావడం తన వ్యక్తిగత వ్యవహారం కాదని అన్నారు. ఈ బిల్లును ఆమోదించింది పార్లమెంట్ అని, ఇది ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం ఎలా సాధ్యమవుతుందని రాందాస్ ప్రశ్నించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్
సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
వేణుగోపాల్‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమించాలి: సుప్రీం
ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace