యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 17:11 IST )
ప్రముఖ వైద్యుడు పి.వేణుగోపాల్ గురువారం ప్రతిష్టాత్మక ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎయిమ్స్ డైరెక్టర్‌ బాధ్యతల్లో పునర్నియమించాలని, ఆయనను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతలను వేణుగోపాల్ మళ్లీ స్వీకరించారు. కేంద్ర మంత్రి అన్బుమణి రాందాస్‌తో వేణుగోపాల్‌ సాగించిన పోరులో ఆయన వెంట నిలిచిన ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్లు, ఇతర సిబ్బంది సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

ఎయిమ్స్ డైరెక్టర్‌గా వేణుగోపాల్ 2003, జులై 3న బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్ల వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగాల్సి ఉండగా ఐదు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద చట్టం తీసుకువచ్చి వేణుగోపాల్‍ను తప్పించింది. ఆయన పదవీకాలం ఈ ఏడాది జులై రెండుతో ముగియనుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సుప్రీం తీర్పు: రాందాస్ రాజీనామాకు బీజేపీ డిమాండ్
పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
వేణుగోపాల్‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమించాలి: సుప్రీం
ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace