|
| పార్లమెంట్‌లో నాటకం ప్లాప్: సుప్రీం తీర్పుపై వేణుగోపాల్
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 8 మే 2008 ( 15:51 IST ) | |
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తనను తొలగించేందుకు పార్లమెంట్ వేదికగా ఆడిన నాటకం ప్లాపయిందని ప్రముఖ వైద్యుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఎయిమ్స్ డైరెక్టర్ హోదా నుంచి వేణుగోపాల్‌ను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చేసిన చట్టం చెల్లదని, ఆయనను పునర్నియమించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంపై వేణుగోపాల్ నేరుగా విలేకరులతో మాట్లాడకపోయినప్పటికీ సహచరుడు అనిల్ శర్మ ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించడం పట్ల వేణుగోపాల్ సంతోషం వ్యక్తం చేశారు. తనను ఎయిమ్స్ బాధ్యతల నుంచి తప్పించేందుకు పార్లమెంట్‌లో సాగిన నాటకం సుప్రీంకోర్టు తీర్పుతో ప్లాప్ అయిందని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|