యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
వేణుగోపాల్‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌గా నియమించాలి: సుప్రీం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 8 మే 2008   ( 15:08 IST )
ఎయిమ్స్ డైరెక్టర్ బాధ్యతల నుంచి వేణుగోపాల్‌ను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టసవరణ చెల్లదని గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ ఎయిర్ డైరెక్టర్‌ పదవి నుంచి వేణుగోపాల్‌ను తొలగించేందుకు చేసిన విశ్వప్రయత్నాలు బెడిసికొట్టినట్లయింది.

తరుణ్ చటర్జీ, హెచ్ఎస్ బేడిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ సంచలన తీర్పు వెల్లడించింది. వేణుగోపాల్‌‌ను ఎయిమ్స్ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ఎయిమ్స్ చట్టానికి సంబంధించి సవరణ చేసింది. అయితే ఎయిమ్స్‌లో ప్రభుత్వ జోక్యాన్ని అడ్డుకోవాలని వేణుగోపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజా తీర్పులో ఎయిమ్స్ చట్టానికి సంబంధించి చేసిన సవరణ చెల్లదని, ఈ సంస్థ డైరెక్టర్ బాధ్యతల్లో తిరిగి వేణుగోపాల్‌ను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఎయిమ్స్ డైరెక్టర్ పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుకు మారుస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసింది. ఈ మార్పుతో కేంద్రం ఎయిమ్స్ నుంచి వేణుగోపాల్‌ను సాగనంపిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎంఎఫ్ హుస్సేన్‌పై క్రిమినల్ చర్యలు అడ్డుకున్న హైకోర్టు
ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
రాజ్ థాకరేకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace