యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ధరలు ఆరు వారాల్లో కిందకు దిగుతాయి: సిబాల్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 13:54 IST )
నిత్యావసర వస్తువుల ధరలు ఆరు వారాల్లో తగ్గుతాయని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ప్రభుత్వం ధరలను నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ఈ చర్యల ద్వారా ఆరు వారాల్లో నిత్యావసర వస్తువులు అదుపులోకి వస్తాయని అన్నారు.

కాంగ్రెస్ ప్రతినిధిగా సిబాల్ విలేకరులతో మాట్లాడుతూ ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాల్సి ఉందన్నారు. అక్రమ నిల్వదారులు, నల్లబజారు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ధరల పెరుగుదలపై ప్రతిపక్ష బీజేపీ నిర్మాణాత్మక ఆలోచనలతో ముందుకురావాలని అన్నారు. ఆకలి రాజకీయాలతో కాకుండా బీజేపీ ధరల నియంత్రణపై సరైన సలహాలు ఇవ్వాలన్నారు. ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ఈ తరహా రాజకీయాలనే అనుసరిస్తుందని సిబాల్ ఆరోపించారు. బీజేపీ ఆకలితో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బెంగుళూరు చేరుకున్న సబీల్ అహ్మద్
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
రాజ్ థాకరేకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మహారాష్ట్ర ప్రభుత్వం
అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
బిరాంచీ హత్య సూత్రధారిని భువనేశ్వర్‌కు తరలింపు
కర్ణాటక: మైనారిటీలకు మంత్రివర్గంలో చోటిస్తామని బీజేపీ హామీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace