|
| మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయం ఉంది: మన్మోహన్
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008 ( 11:28 IST ) | |
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై కేంద్ర మంత్రివర్గంలో ఏకాభిప్రాయం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ కీలక భాగస్వామి ఆర్జేడీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఈ బిల్లుకు సమ్మతించే అవకాశాలున్నాయని ప్రధాని సూచనప్రాయంగా వెల్లడించారు. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టడటంతో మహిళా రిజర్వేషన్ల దిశగా మొదటి అడుగు పడినట్లు అయిందని చెప్పారు.
కేంద్ర మంత్రివర్గంలో ఈ చారిత్రాత్మక బిల్లు కోసం విస్తృత ఏకాభిప్రాయం సాధించగలమని ప్రధాని మన్మోహన్ సింగ్ నమ్మకం వ్యక్తం చేశారు. తమ మంత్రివర్గంలో విభేదాలుంటే ఈ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టడమే కష్టమయ్యేదన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|