|
| అగ్ని పరీక్ష విజయవంతం: దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 మే 2008 ( 16:58 IST ) | |
భారత్ బుధవారం అగ్ని- 3 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో అగ్ని- 3 క్షిపణి భారత వ్యూహాత్మక దళాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్షిపణి 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగివుంది.
ఈ క్షిపణిని భారత్ పరీక్షించడం ఇది మూడోసారి. మొదటి పరీక్ష జులై 9, 2006లో జరగ్గా అది విఫలం అయింది. రెండో పరీక్షను గత ఏడాది ఏఫ్రిల్ 12న నిర్వహించారు. మూడో పరీక్షను బుధవారం ఉదయం 9.56కు నిర్వహించారు. ఈ రెండు, మూడు పరీక్షలు విజయవంతం అయ్యాయి.
తాజా పరీక్షలో 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉంచిన లక్ష్యాన్ని అగ్ని- 3 క్షిపణి 800 సెకెన్లలో ఛేదించింది. అణ్యాయుధాలను సైతం తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి పరిధిలో పాకిస్థాన్‌లోని అన్నినగరాలు, చైనా ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|