|
| బాగ్దాద్‌లో బాంబు పేలుడు: 34మంది మృతి |
| బాగ్దాద్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009 ( 13:09 IST ) | |
బాగ్దాద్‌లోని వాయువ్య ప్రాంతంలో శక్తివంతమైన కారు బాంబు పేలడంతో దాదాపు 34మంది మృతి చెందగా, 72మంది తీవ్రగాయాలకు గురైనారు. ఈ కారు బాంబు పేలుడు పట్టణంలోని వాయువ్య ప్రాంతంలోనున్న శులా క్షేత్రంలో జరిగినట్టు అంతరంగిక భద్రతా శాఖాధికారి ఒకరు తెలిపారు.
ఈ విషయమై సదరు అధికారి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో షియా జాతికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని, ప్రస్తుతం ఇక్కడ జరిగిన దాడి గత నెల 29వ తేదీ జరిగినదానికన్నా పెద్దదని తెలిపారు. గత నెల 29వ తేదీ జరిగిన దాడి సందర్భంగా 50 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజాగా కారు బాంబు పేలుడు జరిగిన ప్రాంతం చాలా రద్దీగా ఉంటుందని, ఇక్కడ పెద్ద, పెద్ద దుకాణాలు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉంటాయని ఆ అధికారి తెలిపారు. ఇలాంటి జన సమర్ధం కలిగిన ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండిన కారును పార్క్ చేసి ఉంచారని ఆ అధికారి తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|