|
| చర్చల పునరుద్ధరణపై క్లింటన్ ఆశాభావం |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009 ( 11:50 IST ) | |
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల పునరుద్ధరణపై అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య నిలిపివేసిన శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించబడతాయనే నమ్మకం తనకుందని చెప్పారు. ఈ చర్చలు పునరుద్ధరించబడితే ఈ రెండు అణు రాజ్యాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని తెలిపారు.
2010 అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యతలపై ఏర్పాటయిన అమెరికా సెనెట్ విదేశీ సంబంధాల కమిటీకి ఆమె ఈ వివరణ ఇచ్చారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంపై ఆశాభావం వ్యక్తం చేసిన హిల్లరీ క్లింటన్ అమెరికా అందిస్తున్న సాయాన్ని పాకిస్థాన్ అణు సామర్థ్యం పెంచుకునేందుకు ఉపయోగించే వీలు లేదని తెలిపారు.
అమెరికా అందిస్తున్న భారీ సాయాన్ని పాకిస్థాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తుందని గత రెండు రోజులుగా అమెరికా మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సెనెటర్ క్రిస్ డాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇందుకు అవకాశం లేదని హిల్లరీ క్లింటన్ వివరణ ఇచ్చారు. తాము అందజేస్తున్న సాయం ఉద్దేశించిన ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|