యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు అంతర్జాతీయం
ప్రధాని మన్మోహన్‌కు ఒబామా ప్రశంసలు
వాషింగ్టన్ (ఏజెన్సీ), గురువారం, 21 మే 2009   ( 10:19 IST )
భారత ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న మన్మోహన్‌సింగ్‌ను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రశంసించారు. ప్రధాని మన్మోహన్ గొప్ప ప్రతిభావంతమైన నేత అని ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను త్వరలోనే భారత్‌ను సందర్శించాలనుకుంటున్నట్టు ఒబామా ఈ సందర్భంగా తెలిపారు.

అమెరికా భారత రాయబారిగా కొత్తగా నియమితులైన మీరా శంకర్ వైట్‌హౌస్‌లో ఒబామాతో సమావేశమైన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారత రాయబారిగా తనను నియమిస్తూ భారత్ అందించిన ధృవీకరణ పత్రాలను ఒబామాకు అందించేందుకై శంకర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొద్దిసేపు జరిగిన ఈ సమావేశంలో భాగంగా ఒబామా మాట్లాడుతూ భారత్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికల ప్రక్రియలో విజయం సాధించిన మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సర్కారుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించడమే కాకుండా త్వరలోనే భారత్‌ను సందర్శించాలనుకుంటున్నట్టు శంకర్ వద్ద తెలిపారు.

ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి, ప్రధానులు తెలిపిన శుభాకాంక్షలను ఒబామాకు, మిచ్చెలీకి శంకర్ అందజేశారు. ఇప్పటివరకు అమెరికాలో భారత రాయబారిగా ఉన్న రోనన్ సేన్ పదవీకాలం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నేపథ్యంలో మీరా శంకర్ ఈ పదవిలో చేరారు. ఈ పదవిని చేపట్టడానికి ముందు ఆమె జర్మనీలో భారత రాయబారిగా పనిచేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పాక్ అణ్వాయుధాలపై బరాక్ ఒబామా ఆందోళన
నూయార్క్‌లో దాడులకు కుట్ర: నలుగురి అరెస్ట్
కొత్త తరహా క్షిపణి పరీక్ష నిర్వహించిన ఇరాన్
అణు సామర్థ్యం పెంచుకుంటున్న పాకిస్థాన్
పాక్‌తో సైనిక సంబంధాల పునరుద్ధరణ: కెనడా
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోటీలో అహ్మదీనెజాద్‌
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...