|
| కొత్త తరహా క్షిపణి పరీక్ష నిర్వహించిన ఇరాన్ |
| సెమ్నాన్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 17:12 IST ) | |
ఇరాన్ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్ బుధవారం తమ శాస్త్రవేత్తలు కొత్త మధ్యతరహా క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారని ప్రకటించారు. ఉపరితలం నుంచి ఉపరితలంమీద లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి పేరు సెజిల్- 2. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి మొహమ్మద్ మొస్తఫా నజ్జార్ తనకు ఈ విషయాన్ని తెలియజేశారని నెజాద్ చెప్పారు.
రెండు దశల్లో నిర్దేశిత లక్ష్యాన్ని తాకే ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని సెమ్నాన్ పట్టణంలో అహ్మదీనెజాద్ వెల్లడించారు. గగనతలంలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఈ క్షిపణి తిరిగివచ్చి లక్ష్యాన్ని ఛేదించిందని నెజాద్ చెప్పడంతో, ఆయన పాల్గొన్న సభలో హర్షధ్వానాలు మోగాయి.
ఈ క్షిపణి ఎంత దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుందనేది నెజాద్ వెల్లడించలేదు. ఇదిలా ఉంటే ఇరాన్ తాజాగా ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయేల్‌ను తాకగలదని అంచనా వేస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|