|
| అణు సామర్థ్యం పెంచుకుంటున్న పాకిస్థాన్ |
| ఇస్లామాబాద్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 16:13 IST ) | |
పాకిస్థాన్ అణ్వాయుధాలను పెంచుకుంటున్నట్లు బుధవారం వెల్లడైన తాజా ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 60 నుంచి 100 వరకు అణ్వాయుధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. వీటి సంఖ్యను పెంచుకునే చర్యలు పాకిస్థాన్ చేపట్టినట్లు ఇటీవల కాలంలో మీడియాలో ప్రచారం జోరుందుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా వెల్లడైన ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం.. చిన్న, తేలికపాటి అణ్వాయుధాలను, థర్మో న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేసేందుకు పాకిస్థాన్ ఫ్లూటోనియం ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. తేలికరకం కొత్త అణ్వాయుధాల్లో ఫ్లూటోనియంను న్యూక్లియర్ ట్రిగ్గర్‌గా, శుద్ధి చేసిన యురేనియంను సెకండరీగా ఉపయోగిస్తారని అమెరికాకు చెందిన అమెరికా ఆయుధ నియంత్రణ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం పాకిస్థాన్ వేగవంతమైన అణ్వాయుధ కార్యక్రమాన్ని చేపట్టిందని, అణ్వాయుధాలు తయారు చేసేందుకు అణు ఇంధనం ఉత్పత్తి కోసం రెండు కేంద్రాలను విస్తరించిందని తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ (ఐఎస్ఐఎస్) తన నివేదికలో పేర్కొంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|