|
| ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోటీలో అహ్మదీనెజాద్ |
| టెహ్రాన్ (ఏజెన్సీ), బుధవారం, 20 మే 2009 ( 15:18 IST ) | |
ఇరాన్ ఎన్నికల సంఘం బుధవారం అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్‌సహా మొత్తం నలుగురి పేర్లను అధ్యక్ష ఎన్నికల పోటీకి ఖరారు చేసింది. జూన్ 12న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ నలుగురు వ్యక్తులు పోటీ చేస్తారని ఇరాన్‌కు చెందిన మెర్ వార్తా సంస్థ వెల్లడించింది.
అహ్మదీనెజాద్‌తోపాటు మాజీ ప్రధానమంత్రి మీర్ హుస్సేన్ మౌసావీ, మాజీ పార్లమెంట్ స్వీకర్ మెహ్దీ కుర్రౌబీ, ఇరాన్ రెవల్యూటరీ గార్డ్స్ మాజీ అధిపతి మొహసేన్ రేజై ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నికల సంఘం (గార్డియన్స్ కౌన్సిల్) ఆమోదం పొందారని తెలిపింది.
మొత్తం 475 మంది ఇరానీయులు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 433 మంది పురుషులు, 42 మంది మహిళలు ఉన్నారు. అయితే 12 మంది సభ్యులతో కూడిన గార్డియన్ కౌన్సిల్ వీరిలో కేవలం నలుగురికి మాత్రమే ఎన్నికల్లో పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|